పరిసరాల పరిశుభ్రత .. ఆరోగ్యానికి భద్రత
పరిసరాల పరిశుభ్రత .. ఆరోగ్యానికి భద్రత
-ఈఓఆర్డి లక్ష్మీనరసమ్మ
కూడేరు (అక్టోబర్ 1)AP 39 TV న్యూస్:-
పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యానికి భద్రత లభిస్తుందని ఈఓఆర్డి లక్ష్మీనరసమ్మ, సర్పంచు లలితమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు వెంకట లక్ష్మమ్మ లు ఉన్నారు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కూడేరులోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో వలంటీర్లు ,వార్డు మెంబర్లు ,సచివాలయ ఉద్యోగులు ,పంచాయతీ అధికారులు, మహిళా పోలీసులు చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రతను నెలకొల్పారు. అనంతరం బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు . అక్కడ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి పరిసరాలను, వీధి రోడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లేకుంటే దోమలు ప్రబలి రోగాల బారిన పడాల్సి వస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు శివరంజని , రఘురాం , మహిళా పోలీసులు పుష్ప ,వెంకట రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు