పరిసరాల పరి శుభ్రతతోనే ఆరోగ్యం పెంపు
పరిసరాల పరి శుభ్రతతోనే ఆరోగ్యం పెంపు
AP39TV న్యూస్, కూడేరు:
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం పెంపొందుతుందని మండల వైద్యాధికారి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని కూడేరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి గ్రామ పురవీధుల్లో వైద్యాధికారులు ,సిబ్బంది ర్యాలీ చేపట్టారు .దోమలు వృద్ధి చెందకుండా చూసుకోండి.. మలేరియా బారిన పడకుండా రక్షణ పొందండి అంటూ వైద్యాధికారి ప్రజలకు సూచించారు. దోమ కాటుతోనే మలేరియా జ్వరం వస్తుందని ,ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో సిహెచ్ఓలు మోహన్ బాబు , వరలక్ష్మి ,సూపర్ వైజర్ రవీంద్ర , వెంకట లక్ష్మమ్మ, ఎంఎల్ హెచ్ పీ లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.