సంగమేశ్వరుడికి నెమలి వాహనం వితరణ

సంగమేశ్వరుడికి నెమలి వాహనం వితరణ

-నెమలి వాహనాన్ని చేయించిన ఆర్యవైశ్యలు

 

కూడేరు ఏప్రిల్ 20 (AP 39 TV న్యూస్):-

కూడేరులో ప్రఖ్యాతిగాంచిన శివపార్వతుల జోడు లింగాల సంగమేశ్వర స్వామి ఆలయానికి కూడేరుకు చెందిన ఆర్యవైశ్యులు పంచలోహాలతో తయారు చేసిన నెమలి వాహనాన్ని శనివారం వితరణ చేశారు. సుమారు రూ. 2.5 లక్షల వ్యయంతో నెమిలి వాహనాన్ని తయారు చేసినట్లు ఆర్యవైశ్యులు తెలిపారు. సంగమేశ్వరుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడవ రోజు ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో నెమలి వాహనంపై శివపార్వతులను ఉంచి ఊరేగింపు చేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఉన్న నెమలి వాహనం పాతబడడంతో కులస్తులు నూతన వాహనాన్ని తయారు చేయించారు. నెమలి వాహనాన్ని గ్రామపురవీధుల్లో మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగింపు చేశారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.