పేదల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం 

-బిజెపి రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్

AP 39TV న్యూస్ కూడేరు:

9 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగించిందని బిజెపి రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ పేర్కొన్నారు. ఇంటింటా బిజెపి కార్యక్రమాన్ని గురువారం కూడేరులో ఆ పార్టీ నేతలు నిర్వహించారు .ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ,అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. అందుకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. కరోనా కరువు నేపథ్యంలో ఉచితంగా బియ్యం అందజేయడం జరిగిందన్నారు. కరోనా వ్యాక్సిన్ని సమర్థవంతంగా అమల్లోకి తీసుకొచ్చి నియంత్రించడంలో దేశం మొదటి స్థానంలో నిలిచిందన్నారు.. పేదల సంక్షేమం కోసం ,దేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్న నరేంద్ర మోడీకి మద్దతుగా నిలవాలని వారు ప్రజలను కోరారు. కార్యక్రమంలో పార్లమెంటు ఇన్చార్జి శ్రీనాథ్ రెడ్డి , అపార్టీ మండల అధ్యక్షులు ఆంజనేయులు ,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మనోబులు, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు వెంకటేష్ నాయక్ ,ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు సదానంద ,సీనియర్ నాయకులు రామాంజనేయులు , ధనుంజయ ,హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు.

Leave A Reply

Your email address will not be published.