మంత్రి పెద్దిరెడ్డి కలిసిన ఎంపీపీ నారాయణరెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి కలిసిన ఎంపీపీ నారాయణరెడ్డి
AP 39TV న్యూస్ కూడేరు:
జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా అనంతపురంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడేరులో ఎంపీడీవో కార్యాలయ భవనం పాతది కావడంతో శిథిలావస్థకు చేరుకుందని నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నతి పత్రాన్ని అందజేశారు
అదేవిధంగా అరవకూరు , మరుట్ల ,కరుట్ల పల్లి రోడ్లు దెబ్బతిన్నాయి .నూతన రోడ్లు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. పి నారాయణపురం వద్ద నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణపు పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. త్వరలోనే నిర్మాణం పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతుందని.. ప్రారంభోత్సవానికి రావాలని ఆయన కోరారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.