కూడేరులో పీర్ల దేవుళ్ళ ప్రతిమల వితరణ
కూడేరులో పీర్ల దేవుళ్ళ ప్రతిమల వితరణ
-మొక్కు తీర్చుకున్న బుర్రా బ్రదర్స్ ,గ్రామ యూత్
AP 39TV న్యూస్, కూడేరు:
కూడేరులో పలవురు భక్తులు తమ కోర్కెలు తీయడంతో పీర్ల దేవుళ్ళ ప్రతిమలను వితరణ చేసి తమ భక్తిని చాటుకున్నారు .వివరాల్లోకి వెళ్ళితే బుర్రా ఎర్రి స్వామి బ్రదర్స్ సుమారు రూ.35000 విలువ చేసే పంచలోహాలతో బుర్ర బాబయ్య పీర్ల దేవుని ప్రతిమను ,గ్రామ యూత్ ఆధ్వర్యంలో సుమారు 35వేల విలువ చేసే పంచలోహాలతో కబడి పీర్ దేవుని ప్రతిమను ఆదివారం కూడేరు పీర్ల చావిడికి వితరణ చేశారు. తొలత పీర్ల దేవుళ్ళ ప్రతిమలను గ్రామ పొలిమేర నుంచి చావడి వరకు డప్పుల నడమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. తర్వాత ముజువార్ ప్రత్యేక చదివింపులు చేసి ప్రతిమలను భద్రపరిచారు .అదే విధంగా చాకలి రామాంజనేయులు ,చాకలి మల్లికార్జున పీర్ల చావిడి ముందు భాగంలో సుమారు రూ. 5000 ఖర్చుపెట్టి హెడ్ లైట్స్ ఏర్పాటు చేసి వెలుతురు వచ్చేలా చేశారు .ఈ సందర్భంగా వితరణ చేసిన భక్తులు మాట్లాడుతూ తమ కోర్కెలు తీరడంతో తమ వంతు సాయంగా ప్రతిమలను వితరణ చేయడం , హెడ్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు