కూడేరులో పేకాట రాయుళ్లు అరెస్ట్

కూడేరులో పేకాట రాయుళ్లు అరెస్ట్

– రూ.1,04,320 నగదు,5 బైక్స్, 10 సెల్ ఫోన్స్ స్వాధీనం

 

కూడేరు(అక్టోబర్ 2)AP 39 TV న్యూస్:-

 

పేకాట స్థావరంపై మెరుపు దాడి చేసి 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై సత్యనారాయణ సోమవారం తెలిపారు. కూడేరు మండల పరిధిలోని జయపురం -చోళ సముద్రం గ్రామాల మధ్య పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సిఐ శేఖర్ ,తాను , సిబ్బంది కలిసి పేకాట స్థావరంపై దాడి చేశామని ఎస్సై తెలిపారు. ఆత్మకూరు మండలానికి చెందిన పదిమందిని ,కూడేరు మండలానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.1,04,320లు నగదు ,10 సెల్ ఫోన్స్ ,5 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు .వారందరి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.