ప్రజల ఏటువంటి పనులు జరగడం లేదు

ఏపీ 39 టీవీ ఛానల్ న్యూస్ సోమందేపల్లి. :

గ్రామ సచివాలయంలో నిలిచిపోయిన ఆన్లైన్ సేవలు: సోమందేపల్లి మండల పరిధిలోని కేతగాని చెరువు గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ 2 సంవత్సారాలు నుండి లేకపోవడం వల్ల ఇక్కడ జరగాల్సిన ప్రజల ఏటువంటి పనులు జరగడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇంచార్జీ పరిపూర్ణయ్యా సార్ గారితో కలవటం వల్ల సచివాలయంలో వారు ప్రజలతో పడుతున్నటువంటి ఇబ్బందిని తెలిపారు. ముందు ఇక్కడ పనిచేస్తూనటువంటి భిందు అనే అమ్మాయి .ఆ అమ్మాయికి పెళ్లి అయినప్పటి నుండి ఆ అమ్మాయి ఇక్కడ విధులకు కు రావటం లేదు.ఆప్పటి నుంచి ఇక్కడ ఎవరు విధులు నిర్వర్తించలేదు. డిజిటల్ అసిస్టెంట్ లేకపోవడం వల్ల సచివాలయంలో ఏలాంటి ఆన్లైన్ సేవలు జరగడం లేదని గ్రామస్తులు తెలియచేశారు. దయచేసి దీనిని పై స్థాయికి తీసుకెళ్ళ లని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. మరియు ఇక్కడ ఉన్నటువంటి VRO గంగాధర్ గారు ఏలాంటి విధులు నిర్వహించకుండ అతని సంతకం కోసం వచ్చిన గ్రామస్తులకు ఇక్కడ ఇప్పుడు ఆన్లైన్ సేవలు చేసే ప్రతినిధి లేరని తెలిపారు. ఆలాగే కేతగానిచేరువు పంచాయితీలోని సుద్దకుంటపల్లి గ్రామంలో వాలంటీర్ మంజునాథ్ అనే అబ్బాయి గ్రామంలో లేకపోవడం వల్ల గ్రామంలో వాలంటీర్ చేయవలసిన పనులు జరగడం లేదని గ్రామస్తులు తెలిపారు. దయచేసి ప్రభుత్వం ఇచేటటువంటి పతకాలను ప్రజలకు అందేలా చూడాలని కోరుతూ మీ మీడియా వారి విజ్ఞప్తి.

Leave A Reply

Your email address will not be published.