కూడేరులో దూరదర్శన్ లైవ్ ద్వారా “మన్ కీ బాత్” వీక్షణ
కూడేరులో దూరదర్శన్ లైవ్ ద్వారా “మన్ కీ బాత్” వీక్షణ
AP39TV న్యూస్, కూడేరు:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తు వస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ఆదివారం నాటికి వందవ ఎపిసోడ్ కు చేరుకుంది. బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు, ఉరవకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కొనకొండ్ల రాజేష్ ఆధ్వర్యంలో కూడేరులో దూరదర్శన్ లైవ్ ద్వారా మన్ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ,కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు ,సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వీటి ద్వారా లబ్ధి పొందేందుకు అవసరమైన మార్గ దర్శనం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రంజిత్ జోహార్ , సీనియర్ నాయకులు రామాంజనేయులు , రామాంజనేయరెడ్డి , కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కురుగుంట మలోబులు ,ఎస్టీ మోర్చా వెంకటేష్ నాయక్ , మండల ప్రధాన కార్యదర్శి ధన , ఎస్సీ సెల్ కొర్రకోడు రామాంజనేయులు ,జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ నాయక్ ,మహిళా మోర్చా లక్ష్మీదేవి ,గీత ,కృష్ణ, చైతన్య రామ ,భీమప్ప తదితరులు పాల్గొన్నారు.