పొలంలోకి రస్తా లేకుండా చేసేందుకు కుట్ర- రైతు మంగళ వెంకటేష్

పొలంలోకి రస్తా లేకుండా చేసేందుకు కుట్ర-

 రైతు మంగళ వెంకటేష్

AP 39 TV న్యూస్, కూడేరు:

తన పొలంలోకి రాస్తా లేకుండా చేసేందుకే ఉదిరిపికొండకు చెందిన పాల లక్ష్మీదేవి అనే రైతు కుటుంబం కుట్ర పన్నుతోందని కూడేరు మండలం జల్లిపల్లికి చెందిన రైతు మంగళ వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు .సర్వేనెంబర్ 327 లో 5 ఎకరాలు పొలం ఉందన్నారు. సుమారు 50 ఏళ్లుగా ఆ పొలం తమ అనుభవంలో ఉందన్నారు. లక్ష్మీదేవి పొలం పక్కనే తమ పొలంలోకి దారి ఉందన్నారు. కానీ దారి లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఆ రైతు కుటుంబ సభ్యులు పొలంలోకి వెళ్లే దారిలో అడ్డంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. దారి లేకుండా చేస్తే ఎలా అని వారికి విన్నవించుకున్నామన్నారు. కానీ వారు వినలేదన్నారు. దీంతో పోలీసులకు, ట్రాన్స్కో అధికారులకు విషయాన్ని చెప్పామన్నారు .పొలంలోకి వెళ్లేందుకు దారి కోసం దిమ్మె ఏర్పాటుకు పెట్టిన రాళ్ళను తొలగించామన్నారు .కానీ టిడిపికి చెందిన ఆ రైతు కుటుంబం అధికార వైయస్సార్సీపి నాయకుల అండతో దౌర్జన్యంగా కరెంటు స్తంభాన్ని ,రాళ్ళను తొలగించారని ఆరోపించడం సరి కాదన్నారు. ఉప సర్పంచ్ సిద్ధారెడ్డి వైయస్సార్ సిపి నేతలు దేవేంద్ర ,బైరెడ్డి రామచంద్రారెడ్డి ,సిద్ధారెడ్డి స్థానికులు భాను ప్రకాష్ వన్నూరు స్వామి మాట్లాడుతూ దౌర్జన్యంగా పొలంలోకి వెళ్లకుండా దారి లేకుండా చేసి అధికార పార్టీ వాళ్లు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతు లక్ష్మీదేవి 15 ఏళ్ల క్రితం పొలాన్ని కొనుగోలు చేశారు .50 ఏళ్లుగా ఉన్న దారిని ఎలా అడ్డుకుంటారని వారు ప్రశ్నించారు. రైతుల సమస్యను రైతులుగా పరిష్కరించుకోవాలి. ఇలా పార్టీలకు రంగు పూయడం సరికాదన్నారు. విద్యుత్ స్తంభం ,ట్రాన్స్ ఫార్మర్ దిమ్మె ఏర్పాటు చేసుకోవడానికి మీ పొలంలో స్థలం చాలా ఉంది. కావాలనే వెంకటేష్ పొలంలోకి వెళ్లే దారిలో ఏర్పాటు చేయడం సరి కాదన్నారు.

పవన్ కుమార్ కుడెరు రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.