పోలింగ్ స్టేషన్ల వద్ద గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టండి

పోలింగ్ స్టేషన్ల వద్ద గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టండి

 

— జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్

కూడేరు ,ఏప్రిల్ 30 (AP 39 TV న్యూస్):-

జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్ మంగళవారం కూడేరు మండల పరిధిలోని సమస్యాత్మక గ్రామాలైన కొర్రకోడు ,జల్లిపల్లి, చోళసముద్రం ,కరుట్లపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆయా గ్రామాలలో ఉన్న రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్ గురించి ఆరా తీశారు. ఆయా గ్రామాలలో గత ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘటనలను సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఎన్నికలలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి తగు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలను తరుచూ సందర్శించి ప్రజలకు భరోసా కలిగేలా కృషి చేయాలన్నారు. రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్ పై ప్రత్యేక నిఘా వేయాలన్నారు. ఎన్నికల వేళ అల్లర్లు, గొడవలకు దూరంగా ఉండేలా చూడాలని సిఐ శివరాముడికి ఆదేశించారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.