పోలీస్ అమరవీరుల సేవలు మరువలేనివి
పోలీస్ అమరవీరుల సేవలు మరువలేనివి
-ఉరవకొండ సీఐ ప్రవీణ్ కుమార్
కూడేరు (అక్టోబర్ 31)AP 39 TV న్యూస్:-
విధి నిర్వహణలో పోలీస్ అమరవీరులు అందించిన సేవలు ఎన్నటికీ మరువలేనివని ఉరవకొండ రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి కూడేరు బస్టాండ్ లో పోలీసులు కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో సిఐ ముఖ్యఅతిథిగా విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు ఎప్పుడు రక్షణగా నిలుస్తారన్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉన్న అన్యాయం జరిగిన పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు. అనంతరం అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ సత్యనారాయణ సిబ్బంది గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు