కమ్మూరులో పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం
కూడేరు,మార్చి3(AP 39 TV న్యూస్):–
∴
పల్స్ పోలియో కార్యక్రమం కూడేరు మండలం కమ్మూరులో విజయవంతమైంది. ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమాన్ని సర్పంచు చిన్న రంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు . చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. పిల్లల నిండు జీవితానికి రెండు చుక్కలు ఎంత దోహదపడతాయని పేర్కొన్నారు. పిల్లల తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో MLHP జయ, ఏఎన్ఎం మాధవి ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు