కొర్రకోడులో పోలియో చుక్కలు వేసిన సర్పంచ్ చంద్రశేఖర్
కూడేరు,మార్చి 3 (AP 39 TV న్యూస్):-
కూడదు మండలం కొర్రకోడులో పోలియో చుక్కుల కార్యక్రమాన్ని ఆదివారం వైద్య సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం మరిచిపోవద్దని వారి తల్లిదండ్రులకు ఆయన సూచించారు. గ్రామంలో పోలియో చుక్కలు వేయడం విజయవంతమైంది.కార్యక్రమంలో MLHP శ్రీవిద్య, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు