జల్లిపల్లిలో పోలియో చుక్కలు వేసిన సర్పంచ్

జల్లిపల్లిలో పోలియో చుక్కలు వేసిన సర్పంచ్

కూడేరు,మార్చి 3 (AP 39 TV న్యూస్):-

కూడేరు మండలం పరిధిలోని జల్లిపల్లి లో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమాన్ని సర్పంచ్ ఉమామహేశ్వరి ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పిల్లల తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించకుండా నిర్లక్ష్యం చేస్తే పోలియో బారినపడి ఆ పిల్లలు జీవితాంతం బాధపడాల్సి వస్తుందని తెలియజేశారు. కాబట్టి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో MLHP లోకేశ్వరి ,ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.