ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జగనన్న సురక్ష

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జగనన్న సురక్ష

-ఎంపీపీ నారాయణరెడ్డి

AP39TV న్యూస్ ,కూడేరు:

నిబంధనల మేరకు ప్రజా సమస్యలకు తక్షణమే పరిష్కారం మార్గం చూపాలన్నదే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎంపిపి నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం కూడేరు మండలం కమ్మూరులో సర్పంచ్ రంగారెడ్డి అధ్యక్షతన జగనన్న సురక్ష పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు 98% తీర్చారన్నారు. ఇంకా మిగిలిన సమస్య లు ఏమైనా ఉంటే అవి కూడా పరిష్కారం చేయడానికి జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం ఈ కార్యక్రమాన్ని అధికారులు పక్కాగా నిర్వహించి ప్రజా సమస్యలకు పరిష్కారమయ్యేలా చూడాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ నేత బైరెడ్డి రామచంద్రారెడ్డి, సెక్రటరీ మురళి ,MLO రవి, సర్పంచ్ హనుమంతరెడ్డి, సచివాలయం కన్వీనర్ రామసుబ్బారెడ్డి ,వాలంటీర్లు, గృహసారతులు బసప్ప సుబ్బన్న కృష్ణ మహేశ్వరీ నాగరాజు ఎర్రిస్వామి సచివాలయ సిబ్బంది వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు.

Leave A Reply

Your email address will not be published.