ప్రజా సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపండి
ప్రజా సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపండి
– జిల్లా ప్రత్యేక అధికారి అరుణ్ కుమార్
AP 39TV న్యూస్ ,కూడేరు:
నిబంధనల మేరకు అర్హత ఉంటే ప్రజా సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపాలని జిల్లా ప్రత్యేక అధికారి అరుణ్ కుమార్ అధికారులకు ఆదేశించారు. కూడేరు మండలం గొటుకూరులో జరుగుతున్న జగనన్న సురక్ష ఇంటింటా సర్వే కార్యక్రమాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. సంక్షేమ పథకాల లబ్ధి పై ఆరా తీశారు. సర్వేని పక్కగా చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు .తర్వాత సచివాలయంలో మండల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు .రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముంగిటకే సేవలు అందించేందుకు చర్యలు చేపడుతోంది.. జగనన్న సురక్షతో ప్రజలకు మరింత చేరువై ఉచితంగా సేవలందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం చేయకుండా పక్కగా సర్వే చేపట్టి అర్హతను బట్టి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కుల, ఆదాయ, జనన ,మరణ , కుటుంబ, కౌలు రైతు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని సూచించారు అక్కడ నుంచి కూడేరు లోని జగనన్న లే అవుట్ సందర్శించి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఆటో తిమ్మటం రైతు భరోసా కేంద్రాన్ని తనకి చేశారు మరి రైతులకు అందుతున్న సేవలుపై సిబ్బందితో ఆరాధించారు గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి పంటలు పరిశీలించి పంటల నమోదు చేయాలన్నారు. అర్హత ఉన్న రైతులందరికీ సబ్సిడీ విత్తనాలు ఎరువులు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆశాలతో ఎంపీపీ నారాయణరెడ్డి జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ డిపిఓ ప్రభాకర్ రావు డిఎస్ఓ శోభారాణి డి ఎల్ డి ఓ ఓబులమ్మ,. ఆర్డీవో, మధుసూదన్ ఏడి రవి , తహసిల్దార్ శేషారెడ్డి ,ఎంపీడీవో ఎంకే భాషా , ఏఓ విజయ్
కుమార్ ,హౌసింగ్ శేఖర్, సచివాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు