ఇది ప్రజా ప్రభుత్వం
-ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి
AP 39TV న్యూస్,కూడేరు:
వైఎస్సార్ సిపిది ప్రజా ప్రభుత్వమని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజల వద్దకే వెళ్లి సంక్షేమ పథకాలను వర్తింపజేస్తూ .. ఇతర సేవలను అందించడం జరుగుతోందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం కూడేరు మండలం అరవకూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేయగా మహిళలు హారతులు బట్టి ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్దిని వివరిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో సర్పంచులు రామాంజనేయులు ,రంగారెడ్డి, ఓబులమ్మ ,ధనుంజయ, ఓబులేసు, ఎంపీపీ నారాయణరెడ్డి, జెడ్పిటిసి సభ్యురాలు అశ్విని, వైస్ ఎంపీపీలు దేవా ,సుబ్బమ్మ , అగ్రి అడ్వైజరి మండల చైర్ పర్సన్ నిర్మలమ్మ , వైఎస్సార్ సీపీ నేతలు సుబ్బారెడ్డి , రాజన్న రామకృష్ణ ,పెద్దన్న , బైరెడ్డి రామచంద్రారెడ్డి ,దేవేంద్ర గంగాధర ,హనుమంత రెడ్డి , నరేష్ ,సత్యనారాయణ , రమేష్, ఎంపీడీవో ఎంకే భాషా , డిప్యూటీ తహసిల్దార్ విశ్వనాథ్ , పిఆర్ ఏఈ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి మురళి , సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు