ప్రజలకు సంక్షేమ పథకాలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం
ఎంఎల్ఎ తిప్పేస్వామి
AP 39TV మే 1:
గుడిబండ మండల పరిధిలోని గుణేమోరుబాగిలు గ్రామ పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎంఎల్ఏ తిప్పేస్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాధమ్మ, జెడ్పిటిసి భూతరాజు, సింగిల్ విండో అధ్యక్షుడు చంద్రశేఖర్, జెసిఎస్ కన్వీనర్ శివకుమార్, సర్పంచ్ డిఎల్ ఎంజారేగౌడ్, వైకాపా నాయకులు నాగరాజ్ గుప్తా, రమేష్, పాండు, తదితర వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొంకళ్లు శివన్న
AP 39 TV CHANNEL
గుడిబండ, మడకశిర ఇంచార్జీ
సత్యసాయి జిల్లా