ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

 

కూడేరు(AP 39 TV న్యూస్):-

తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించే ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని

రైతు సాధికార సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు .శనివారం కూడేరు మండలం కడదరగుంటలో శంకరయ్య పొలంలో, చోళ సముద్రంలో భీమ లింగ, పెన్నోబులేసు పొలాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేసిన చేసిన చీనీ,మామిడి,నేరేడు, వేరుశనగ ,ముల్లంగి క్యారెట్ బీట్రూట్ తదితర పంటలను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందన్నారు .రైతులు ఈ విధానంలో పంటలు సాగు చేసి ఆర్థికంగా బలోపేతం చెందాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి , నారాయణపురం సర్పంచ్ హనుమంత్ రెడ్డి, ఎన్ ఎఫ్ ఏ సురేష్ , డీఎంఎం లు దుర్గాదేవి , నవీన్ షా, ఎల్ వన్ కుల్లాయప్ప, పెద్దిరెడ్డి, ఎం సి ఏ వెంకటేశులు, సిఆర్ ఎస్పి రమేష్ , రైతులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.