ప్రణయ్ రెడ్డికి నీరా”జనం”

ప్రణయ్ రెడ్డికి నీరా”జనం”

 

కూడేరు,ఫిబ్రవరి 29(AP 39 TV న్యూస్):-

అరవకూరులో గురువారం వైఎస్సార్ సీపీ నేతలు “విజయ సంకల్ప యాత్ర “కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ రాయలసీమ జోనల్ ఇంచార్గ్ వై ప్రణయ్ కుమార్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోకి రాగానే ప్రజలు పార్టీ నేతలు పూల వర్షం కురిపించారు. మహిళలు హారతులు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. బహిరంగ సభ వరకు ఆయనను పార్టీ కార్యకర్తలు ప్రజలు తమ భుజాలపై ఎత్తుకొని ఊరేగింపుగా తరలి వెళ్లారు .ఈ సందర్భంగా ఆయన ప్రజలకు అభివాదం చేశారు.జై జగన్ ..విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రామానికి రూ. 70 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన తారు రోడ్డును ఆయన ప్రారంభించారు.కార్యక్రమంలో ఎంపీపీ నారాయణ రెడ్డి, సర్పంచులు రామాంజనేయులు రంగారెడ్డి చంద్రశేఖర్ ఓబులమ్మ ధనుంజయ ఎంపిటిసి సభ్యులు రమేష్ శివ లాల్ రెడ్డి, ఆ పార్టీ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి,అనుబంధ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.