కొర్రకోడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి నిధులు కేటాయించండి

కొర్రకోడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి నిధులు కేటాయించండి

-మంత్రిని కోరిన సర్పంచ్ చంద్రశేఖర్ ,ఎంపీటీసీ శివలాల్ రెడ్డి

AP39TV న్యూస్ కూడేరు:

 

రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి విడదల రజిని శుక్రవారం అనంతపురం పట్టణానికి విచ్చేశారు ఈ సందర్భంగా కూడేరు మండలం కొర్రకోడు సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ , ఎంపీటీసీ సభ్యుడు శివలాల్ రెడ్డిలు మంత్రిని కలిశారు .కొర్రకోడుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు అయిందన్నారు.కానీ నిధులు విడుదల కాలేదని ఆమెకు తెలిపారు. కొర్రకోడలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని వివరించారు. ప్రస్తుతం 12 నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య సేవలు పొందాలంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆమెకు వివరించారు.కావున ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరుకు కృషి చేయాలని వారు వినతి పత్రాన్ని అందజేసి.. విన్నవించుకున్నారు. స్పందించిన మంత్రి నిధుల విడుదలకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.