ప్రివేలేజ్ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్సీ వై.శివరామ రెడ్డి ఎంపిక పట్ల హర్షం
ప్రివేలేజ్ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్సీ వై.శివరామ రెడ్డి ఎంపిక పట్ల హర్షం
– భవిష్యత్తులో శివరాం రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు పొందాలి
– డీసీఎంఎస్ మాజీ అధ్యక్షుడు సోమర జయచంద్ర నాయుడు
కూడేరు (సెప్టెంబర్ 27) AP 39 TV న్యూస్:-
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గా ఉమ్మడి అనంతపురము జిల్లా శాసన మండలి సభ్యులు వై. శివరామ రెడ్డి నియామకం పట్ల డీసీఎంఎస్ మాజీ అధ్యక్షుడు సోమర జయచంద్ర నాయుడు హర్షం వ్యక్తం చేశారు . బుధవారం ఆయన కూడేరులో విలేకరులతో మాట్లాడారు. శివరాం రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను పొందాలని ఆయన ఆకాంక్షించారు. పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసే నేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సముచిత న్యాయం కల్పిస్తారని ..అందుకు నిదర్శనం ఎమ్మెల్సీ శివరాం రెడ్డికి చైర్మన్గా ఎంపిక చేయడమేనని ఆయన పేర్కొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు