అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి
అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి
– సిపిఐ నేతలు
AP 39 TV ,న్యూస్ కూడేరు:
మణిపూర్ లో మహిళలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని శనివారం కూడేరులోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కురుగుంట మనోహర్, నియోజకవర్గ నాయకులు పెరుగు సంగప్ప,మండల కార్యదర్శి నారాయణమ్మ లు మాట్లాడుతూ మణిపూర్ లో మహిళలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు,నెలలు గడిచినప్పటికీ మణిపూర్ లో శాంతి భద్రతలను కాపాడడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందన్నారు, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కులాలకు,మతాలకు మధ్య చిచ్చు పెట్టడమే ప్రధాన అజెండాగా బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు,మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లను తక్షణం అదుపు చేయాలని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు రమణ, ముట్టాల శ్రీరాములు, మలరాయుడు, నారాయణస్వామి, ఖాసిం పీరా, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు