రామాలయంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం
రామాలయంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం
-అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
కూడేరు (ఆగస్టు 30)AP 39TV న్యూస్:-
కూడేరు లోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో బుధవారం పౌర్ణమిని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు . గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించిన ..విన్న వారి సమస్యలు తొలగి వారి కుటుంబంలో ,గ్రామంలో సుఖ సంతోషాలు ఉంటాయని . తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో రామాలయ కమిటీ సభ్యులు పురుషోత్తం , హరినాథ్ , బొజ్జన్న యాదవ్ తో పాటు పలువురు సభ్యులు , గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు