దాన,ధర్మలకు ప్రతీక రంజాన్౼ ఎమ్మెల్యే  అనంత వెంకటరామిరెడ్డి

దాన,ధర్మలకు ప్రతీక రంజాన్౼ ఎమ్మెల్యే

 అనంత వెంకటరామిరెడ్డి

 

అనంతపురం, ఏప్రిల్ 21;

దాన, ధర్మలకు ప్రతీక రంజాన్ పండుగ అని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి చెప్పారు. శుక్రవారం ఏ నారాయణపురం మసీదు వద్ద వైయస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని చెప్పారు.అందులో భాగంగా అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఏటా రూ.15వేలు అందిస్తున్నారని చెప్పారు. తద్వారా తల్లిదండ్రులకు పిల్లల చదువులు భారం కాకుండా ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం తో పాటు అభివృద్ధి పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. నారాయణపురం మసీదు అభివృద్ధి కి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం తపోవనం సర్కిల్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రం ను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో అనంతపురం నగర మేయర్ వసీం సలీమ్, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యషుడు కాగజ్ ఘర్ రిజ్వాన్, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు సైఫుల్లా బేగ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఓబిరెడ్డి, పలువురు కార్పొరేటర్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.