పోటా పోటీగా రాతిదూలం లాగుడు పోటీలు

పోటా పోటీగా రాతిదూలం లాగుడు పోటీలు

కూడేరు, మార్చి 9 (AP 39 TV న్యూస్):-

కూడేరు మండలం మరుట్ల- 3 వ కాలనీలో మహా శివరాత్రిని పురస్కరించుకొని చిదంబరేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా శనివారం జిల్లా స్థాయి రాతిదూలం లాగుడు పోటీలను నిర్వహించారు. ఏఆర్ డిస్పీ ముని రాజా పోటీలను ప్రారంభించారు. పోటీలు పోటాపోటీగా సాగాయి. మొదటి బహుమతి రూ. 30 వేలు నగదును వేంపల్లి మండలం గాజులపల్లి కి చెందిన పసుపులేటి రమణ వృషబాలు దక్కించుకున్నాయి. రెండవ బహుమతి రూ.20 వేలును అనంతపురం కు చెందిన ఒబులపతి అచారి వృషభాలు, మూడవ బహుమతి రూ.10 వేలును గార్లదిన్నేకు చెందిన పరమేష్ వృషభాలు , నాల్గవ బహుమతి రూ.5 వేలును రాయదుర్గం మండలం గొల్లల దొడ్డికి చెందిన వీరేష్ వృషభాలు దక్కించుకున్నాయి. నిర్వాహకులు విజేతలకు బహుమతులను అందజేశారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు సత్యనారాయణ, ఎర్రిస్వామి, పెన్నోబులేసు, శ్రీనివాసులు, రామాంజనేయులు ,బాలకృష్ణ, బి .ఎర్రిస్వామి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. రాతి దూలం లాగుడు సందర్భంగా ఎలాంటి గొడవలు ,తోపలాటలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.