ప్రజల వద్దకే పాలన అందించిన ఘనత సీఎం జగన్ దే

ప్రజల వద్దకే పాలన అందించిన ఘనత సీఎం జగన్ దే

కూడేరు(AP 39 TV న్యూస్):-

సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల వద్దకే పాలన అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.కూడేరు మండలం కమ్మూరులో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం , హెల్త్ క్లినిక్ భవనాలను మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా, రైతుల సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన సాగిస్తున్నారన్నారు., అందులో భాగంగానే ఈ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కావడం జరిగిందన్నారు. వీటి ద్వారా అందే సేవలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి, జడ్పిటిసి సభ్యురాలు అశ్విని, సర్పంచ్లు చిన్న రంగారెడ్డి, రామాంజనేయులు, ఓబులేష్, హనుమంత రెడ్డి ,సువర్ణమ్మ, చంద్రశేఖర్, ధనంజయ, ఓబులమ్మ, టిటిసి సభ్యుడు రమేష్ ,మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, అగ్రి అడ్వైజరి మండల కమిటీ అధ్యక్షురాలు నిర్మలమ్మ, , వైస్ ఎంపీపీలు దేవా ,సుబ్బమ్మ ,ఆ పార్టీ నేతలు ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సంగప్ప, నేతలు పెద్ద రంగారెడ్డి, నారాయణస్వామి రామసుబ్బారెడ్డి, రామాంజనేయులు, రంగనాథరెడ్డి ,వెంకటరామిరెడ్డి, వన్నూరప్ప, క్రిస్టప్ప , మదన్ మోహన్ రెడ్డి వన్నూరప్ప నరేష్ విజయభాస్కర్ రెడ్డి సర్దార్ గంగాధర్ తిమ్మారెడ్డి నీలకంఠ రెడ్డి భాస్కర్ రెడ్డి రామాంజనేయులు లోకనాథ్ స్వామి, ఎంపీడీవో ఎంకే భాషా ఏవో విజయ్ కుమార్ డాక్టర్ సౌమ్య రెడ్డి , పిఆర్ ఏఈ శ్రీనివాసులు ,పంచాయతీ కార్యదర్శులు మురళి పావని ప్రభావతి ,భాషతో పాటు పలువురు నేతలు , సచివాలయ ,రైతు భరోసా, హెల్త్ క్లినిక్ సిబ్బంది పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్,

రిపోర్టర్,

కూడేరు.

Leave A Reply

Your email address will not be published.