ఇప్పేరులో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

ఇప్పేరులో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

 

కూడేరు(AP 39 TV న్యూస్):-

కూడేరు మండల పరిధిలోని ఇప్పేరు ప్రాథమికొన్నత పాఠశాలలో శుక్రవారం గణ తంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంపీటీసీ సభ్యుడు రమేష్, సర్పంచ్ ఓబులేసు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జండావిష్కరణ చేశాక విద్యార్థులు, ఉపాధ్యాయులు జండా వందనం చేశారు .దేశభక్తి పాటలకు పిల్లలు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. తర్వాత ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులకు సరఫరా చేసిన ట్యాబులను ఎంపీటీసీ సభ్యుడు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.