అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రం లో కోట్ల విలువచేసే ప్రభుత్వ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం.
సర్వేనెంబర్ 51-5 నుండి 51-10 ల లో 3.96 సెంట్ల ప్రభుత్వ భూమిలో ఏకంగా వెంచర్ వేసి అమ్మకానికి సిద్ధంగా పెట్టారు. ఈ ప్రభుత్వ భూమి పైన ఎన్నోసార్లు రెవెన్యూ సిబ్బందికి తెలిపినా తూతూ మంత్రంగా వెళ్లి, పట్టించుకోకపోగా పైగా వాళ్లకే వంత పాడుతూ వస్తున్నారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఎందుకు రక్షించలేకపోతున్నారు? దీని వెనక కారణాలు ఏంటి? కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డిఓ గారి దృష్టికి తీసుకుపోయి మరింత లోతుగా పరిశోధన చేసి నిజా నిజాలు తేలుస్తాం. ప్రభుత్వ భూమిని కాపాడుకుందాం.