గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి పెద్ద పీఠ

గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి పెద్ద పీఠ

కూడేరు,మార్చి 8(AP39TV న్యూస్):-

వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట వేసిందని ఉరవకొండ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త శంకర్ నారాయణ పేర్కొన్నారు.కూడేరు మండలం పి.నారాయణపురంలో శుక్రవారం వారు ఉపాధి హామీ నిధులు రూ .70 లక్షలతో సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.70 లక్షలతో దళితవాడకు సిమెంటు రోడ్డు వేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు, గ్రామాల్లో వీధులలోని రోడ్లు అద్వానంగా ఉండేవన్నారు. కానీ జగన్ పాలనలో రోడ్ల రూపు రేఖలే మారిపోయాయి అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి, సర్పంచులు హనుమంత రెడ్డి , రంగారెడ్డి, ఓబులమ్మ ,వైస్ ఎంపీపీ సుబ్బమ్మ ,అగ్రి అడ్వైజరి మండల చైర్ పర్సన్ నిర్మలమ్మ, ఆ పార్టీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, నేతలు తుప్పటి హరీష్, ఉదిరిపికొండ నరేష్. సిద్ధారెడ్డి , మాధవ రెడ్డి,ఆదినారాయణ ,ఎర్రిస్వామి , శివరావు శంకర్ నాయక్ ఎర్ర నాగప్ప, శంకర్ రెడ్డి ఎంసీఏ ఆంజనేయులు, లాలెప్ప , లక్ష్మీరెడ్డి ,నాగేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, శంకరయ్య, రామాంజనేయులు, శంకర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, కరుట్లపల్లి అ క్కులన్నతో పలువురు నాయకులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.