ఎంపీపీ నిధులతో ఎంఎంహళ్లి రోడ్డు వంకకు కల్వర్టు ఏర్పాటుకు చర్యలు
ఎంపీపీ నిధులతో ఎంఎంహళ్లి రోడ్డు వంకకు కల్వర్టు ఏర్పాటుకు చర్యలు
AP 39TV న్యూస్ కూడేరు:
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక కూడేరు మండల పరిధిలోని ఎంఎం హళ్లి గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గానికి మోక్షం కలుగుతోంది. గ్రామం వద్ద పెన్నా నది వంక పారుతుంది. వంకలో నీరు ఎక్కువగా ప్రవహిస్తే వాహనదారులు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు. దీంతో ఎంపీపీ నారాయణరెడ్డి స్పందించి తన గ్రాంట్ తో తాత్కాలికంగా కల్వర్టు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. అందులో భాగంగా సోమవారం సిమెంటు పైపులు వంక వద్దకు తీసుకువచ్చారు. ప్రస్తుతానికి సిమెంట్ పైపు ఏర్పాటు చేసి గ్రామస్తులకు రోడ్డు మార్గం ఏర్పాటు చేయిస్తామని ఎంపీపీ, స్థానిక వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు.
పవన్ కుమార్, రిపోర్టర్ Kuderu