రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ
కూడేరు(అక్టోబర్ 24)AP 39 TV న్యూస్:-
కూడేరు పోలీస్ స్టేషన్ లో మంగళవారం మండల వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లకు సిఐ ప్రవీణ్ కుమార్ కౌన్సిలింగ్ ఇచ్చారు .ఎన్నికలు సమీపిస్తున్నాయని ఎవరైనా గ్రామాల్లో గొడవలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. మంచి మార్గంలో నడుస్తూ రౌడీషీటర్ ముద్రను పోగొట్టుకోవాలని ఆయన సూచించారు. గ్రామాల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని తెలియజేశారు కార్యక్రమంలో ఎస్ఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు