రైతు మృతి

నీరు పెట్టే క్రమంలో మోటర్ స్టార్టింగ్ బటన్ మరియు ఆఫ్ బటన్ నొక్కి క్రమంలో రైతు మృతి

 

సత్యసాయి జిల్లా ap 39tv 30 oct 2023:

పాముదుర్తి గ్రామానికి చెందిన షేక్ బాబావలి తండ్రి పేరు షేక్ మస్తాన్ వలి, వయస్సు 39 yrs, ఇతనికి ఇద్దరు కొడుకులు సంతానం. ఇతను తేదీ 29.10.23 వ తేదీన మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో తన పొలంలోని మల్లెపూల మొక్కలకు తన బోర్ ద్వారా నీళ్లు కట్టిన తర్వాత బోర్ మోటర్ ను ఆఫ్ చేయడం కోసం స్టాటర్ పెట్టె దగ్గరకి వెళ్లి అతను తడిచిన ఎడమచేతి వేళ్ళుతో స్టాటర్ లోని ఆఫ్ బటన్ ను నొక్కినప్పుడు ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి స్టాటర్ పెట్టె దగ్గరలోనే చనిపోయాడు. అతను చనిపోయిన విషయం తన భార్యకు సాయంత్రం అయిన ఇంకా ఇంటికి రాలేదు అని ఆమెకు అనుమానం వచ్చి ఆమె, తన కొడుకు ఇద్దరు పొలం దగ్గరికి వెళ్లి చూడగా స్టాటర్ పెట్టె దగ్గర తన భర్త కింద పడి ఉండి అతని ఎడమ చేతికి మరియు ఎడమకాళ్ళుకు అయిన కాలిన గాయాలు చూసి కరెంటు షాక్ వలన చనిపోయినాడని తెలుసుకొని అతని బాడీని ఇంటికి తీసుకొని వెళ్లి ఈరోజు ఉదయం చనిపోయిన వ్యక్తి యొక్క భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్ట్ మోర్టం చేయించడమైనది.

 

అలకుంట్ల రాజు

రిపోర్టర్స్

*AP 39 TV*

*శ్రీ సత్య సాయి జిల్లా ఇంచార్జ్*

Leave A Reply

Your email address will not be published.