10 నుంచి రైతు గర్జన ప్రచార జాత
10 నుంచి రైతు గర్జన ప్రచార జాత
AP 39TV న్యూస్ కూడేరు:
నీటి సాధన కోసం ఈనెల 10 నుంచి 20 వరకు రైతు గర్జన ప్రచార జాతను నిర్వహించనున్నట్లు సిపిఐ నేతలు శుక్రవారం విలేకరులకు తెలిపారు. అందుకు సంబంధించిన కర పత్రాలను విడుదల చేశారు. హెచ్ఎల్ సి ఆధునికరణ పనులు చేపట్టాలని ,రైతులు రుణమాఫీ చేయాలని ,హంద్రీనీవా కాలవ వెడల్పు చేపట్టాలన్న డిమాండ్లతో ఈ జాత జరుగుతుందన్నారు. కాబట్టి మండలం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పెరుగుసంగప్ప. రమణ సిపిఐ మండల కార్యదర్శి నారాయణమ్మ , వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మల రాయుడు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు