సమస్యల పరిష్కారం కోసమే “జగనన్నకు చెబుదాం”
సమస్యల పరిష్కారం కోసమే “జగనన్నకు చెబుదాం”
-ఎంపీపీ నారాయణరెడ్డి, ఎంపీడీఓ ఎంకే బాషా
AP39TV న్యూస్, కూడేరు:
ప్రభుత్వ సేవలకు సంబంధించి ఎలాంటి సమస్యల పరిష్కారానికైనా త్వరితగతిన పరిష్కారం చూపాలన్నదే “జగనన్నకు చెబుదాం” కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని ఎంపిపి నారాయణ రెడ్డి , ఎంపీడీవో ముస్తఫా కమల్ బాషా తెలిపారు .మంగళవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఎంపీపీ ఎంపీడీవో, ఇతర మండల అధికారులు వారి కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్నకు చెబుదాం సీఎం సందేశాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు , ఎంపీటీసీ సభ్యులు ,వార్డు సభ్యులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఎంపీపీ ఎంపీడీవో విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింపులో ఏమైనా సమస్యలు ఉంటే 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయవచ్చన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ నాగభూషణ రెడ్డి ,హార్టికల్చర్ ఆఫీసర్ నెట్టికంటయ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.