సమ్మె విరమించిన తాగునీటి కార్మికులు

సమ్మె విరమించిన తాగునీటి కార్మికులు

 

AP39TV న్యూస్ ,కూడేరు:

కూడేరు మండలానికి తాగునీటిని సరఫరా చేసే సిపిడబ్ల్యూఎస్ ప్రాజెక్టులో పని చేస్తున్న కార్మికులు పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్లిన విషయం విధితమే. రెండు రోజుల క్రితం ఆర్డబ్ల్యుఎస్ ఇంచార్జ్ ఎస్ఈ జవహర్ కుమార్ పీఏబీఆర్ డ్యాం వద్దకు వెళ్లి ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులతో చర్చలు జరిపారు .పెండింగ్ లో ఉన్న 4 నెలల వేతనాల్లో రెండు నెలల వేతనాలను మీ ఖాతాల్లోకి జమ చేశాం. మిగిలిన 2 నెలల జీతాలను కొంత సమయం తీసుకుని జమ అయ్యేలా చూస్తామని చెప్పారు .కానీ కార్మికులు అంగీకరించలేదు. శనివారం సూపర్ వైజర్ మంజునాథ్ రెడ్డి వెళ్లి కార్మికులతో చర్చించారు. 25వ తేదీలోపు మిగిలిన రెండు నెలల వేతనాలను ఇచ్చేలా అధికారుల తరఫున హామీ ఇచ్చి రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. .దీంతో కార్మికులు సమ్మెను విరమించి విధుల్లోకి చేరారు. గ్రామాలకు తాగునీటిని సరఫరా చేశారు.

Leave A Reply

Your email address will not be published.