25 నుంచి సమ్మెబాట పడతాం
25 నుంచి సమ్మెబాట పడతాం
-సత్య సాయి తాగునీటి ప్రాజెక్టు కార్మికులు
కూడేరు(ఆగస్టు 22)AP 39TV న్యూస్:-
ఈనెల 25 నుంచి సమ్మెబాట పడుతున్నట్లు మండల పరిధిలోని పిఏబిఆర్ డ్యామ్ వద్ద ఉన్న శ్రీ సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు కార్మికులు పేర్కొన్నారు .మంగళవారం ఆ ప్రాజెక్టు కార్మిక సంఘం నేతలు శ్రీనివాసులు ,గోవిందు, రామచంద్ర ,వసికేర్ తదితరులు విలేకరులతో మాట్లాడారు .ఐదు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ,18 నెలలుగా ఈఎస్ఐ చెల్లించలేదని ,ఎనిమిది నెలలుగా పిఎఫ్ కట్టలేదని వారు పేర్కొన్నారు .తమ న్యాయపరమైన డిమాండ్లను సాధించుకునేందుకే సమ్మేటపడుతున్నట్లు వారు తెలిపారు .ఈ మేరకు ఎంపీడీవో ఎంకే భాషాను , ఎస్ఐ సత్యనారాయణ ను , రెవెన్యూ అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చినట్లు వారు తెలిపారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు