గర్భిణీలు ,బాలింతలకు సంపూర్ణ ఆరోగ్యం
గర్భిణీలు ,బాలింతలకు సంపూర్ణ ఆరోగ్యం
-పి.నారాయణపురం సర్పంచ్ హనుమంత రెడ్డి
కూడేరు(ఆగస్టు 4) AP 39TV న్యూస్:
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద అందజేస్తున్న కిట్లతో గర్భిణీలు బాధితులకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సర్పంచ్ హనుమంతు రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కూడేరు మండల పరిధిలోని పి .నారాయణపురంలో వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి కిట్లను గర్భిణీలకు అందజేశారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు .కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు ,సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు