ఇసుకను తోలుకోవడానికి అనుమతులు ఇవ్వండి
– కలెక్టర్ కు ఎంపీపీ నారాయణరెడ్డి వినతి
AP39 TV న్యూస్ ,కూడేరు:
కూడేరు మండల పరిధిలోని ఎంఎం పల్లి గ్రామం వద్ద వెళ్లిన పెన్నానది నుంచి నిర్మాణాల కోసం ఇసుకను తోలుకోవడానికి అనుమతులు ఇవ్వాలని ఎంపీపీ నారాయణరెడ్డి కలెక్టర్ గౌతమికి విన్నవించుకున్నారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఎంపీపీ నారాయణరెడ్డి కలెక్టర్ ను కలిసి మాట్లాడారు. ఇసుక అందుబాటులో లేకపోవడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని ఆయన వివరించారు. ఇసుక అందుబాటులో ఉంటే ప్రజలు కూడా ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసుకుంటారని తెలియజేశారు. స్పందించిన కలెక్టర్ పరిశీలించి చర్యలు చేపడతామన్నారు.