సూర్య చంద్ర రెడ్డికి, మల్లయ్య కి ఘనంగా సన్మానం
సూర్య చంద్ర రెడ్డికి, మల్లయ్య కి ఘనంగా సన్మానం
AP 39TV,న్యూస్ కూడేరు:
కూడేరు మండలం జయపురం ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తూ బదిలీ అయిన సూర్య చంద్రారెడ్డి ,మల్లయ్య ఉపాధ్యాయులకు శుక్రవారం ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారులు చంద్రశేఖర్, సాయికృష్ణలు విచ్చేశారు .ఆ ఇద్దరి ఉపాధ్యాయుల సేవలు గురించి వారు కొనియాడారు. అనంతరం పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు .కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు