బైరెడ్డి రామచంద్రారెడ్డికి ఘనంగా సత్కారం
కూడేరు (అక్టోబర్ 5)AP 39 TV న్యూస్:-
కూడేరు మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడుగా జల్లిపల్లికి చెందిన బైరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశాడు. అనంతరం ఎంపీపీ నారాయణరెడ్డి, పార్టీ మండల నేతలు గొటుకూరు మదన్ మోహన్ రెడ్డి, శంకరయ్య మంజునాథ్ రెడ్డి ,తోపుదుర్తి రామాంజనేయులు, నరేష్, ప్రకాష్ రెడ్డి, ఎర్రనాగప్ప, సంగప్ప, అంజి తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తరువాత శాలువాలు కప్పి పూలమాలలను వేసి ఘనంగా సత్కరించారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు