విద్యా రంగానికి సీఎం జగన్ పెద్ద పీఠం

విద్యా రంగానికి సీఎం జగన్ పెద్ద పీఠం 

_ఎంపీపీ నారాయణరెడ్డి

AP 39TV న్యూస్ కూడేరు:

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి పెద్దపీట చేస్తున్నాడని ఎంపీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం కూడేరు మండల పరిధిలోని కమ్మూరులోని ప్రాథమిక పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా సాగింది .ఈ కార్యక్రమానికి ఎంపీపీ ముఖ్యఅతిథిగా విచ్చేసి పిల్లలకు కిట్లను పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యను అందించాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. అందుకే నాడు- నేడు పథకం ద్వారా ప్రభుత్వ బడుల రూపు రేఖలు మార్చేసి కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు.

జగనన్న విద్యా కానుక ద్వారా పిల్లలకు బూట్లు బెల్టు బ్యాగ్ యూనిఫామ్ అందించడంతో తమ పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నంత అనుభూతి పేద పిల్లల తల్లిదండ్రుల్లో కలుగుతోందన్నారు. పేద పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వం బడులకు పంపి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన సూచించారు .కార్యక్రమంలో సర్పంచ్ చిన్న రంగారెడ్డి , ఎంఈఓ చంద్రశేఖర్ ,హెచ్ఎం శ్రీరాములు ,ఉపాధ్యాయులు శ్రీనివాసులు ,సునీత , ఇందిరమ్మ ,జిలాన్ భాష ,విద్యా కమిటీ చైర్మన్ కృష్ణప్ప ,వైస్ చైర్మన్ బసప్ప ,పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.