SEAS పరీక్ష నిర్వహణపై శిక్షణ
-పరీక్షలు పొరపాటు లేకుండా నిర్వహించాలి
-మండల విద్యాధికారులు చంద్రశేఖర్ ,సాయి కృష్ణ
కూడేరు (అక్టోబర్ 25)AP 39 TV న్యూస్:-
కూడేరు ఎమ్మార్సీ సెంటర్లో బుధవారం సీస్ స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వే పరీక్ష నిర్వహణపై ప్రధాన ఉపాధ్యాయులుకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారులు చంద్ర శేఖర్, సాయికృష్ణ మాట్లాడుతూ నవంబర్ 3వ తేది ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్ధుల సామర్థ్యాన్ని బయటికి తీయాలన్నది ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం అన్నారు. 3 ,6 ,9వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారన్నారు. కాబట్టి పరీక్షలు ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు ,వెంకటేష్, శ్రీదేవి ,రవిశంకర్ మండల విద్యాశాఖ సిబ్బంది ఆంజనేయులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ వెంకటరమణ ,శివ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు