సేవా గుణాన్ని అలవర్చుకోండి
సేవా గుణాన్ని అలవర్చుకోండి
-తెలుగు రాష్ట్రాల NCC జనరల్ డిప్యూటీ డైరెక్టర్ V.M. రెడ్డి
కూడేరు(సెప్టెంబర్ 7)AP 39TV న్యూస్:-
NCC క్యాడెట్లు సేవా గుణాన్ని అలవర్చుకొని సమాజ సేవకు కృషి చేయాలని తెలుగు రాష్ట్రాల NCC జనరల్ డిప్యూటీ డైరెక్టర్ V.M. రెడ్డి పిలుపునిచ్చారు. రెండవ రోజు గురువారం కూడా ఆయన కూడేరు మండల పరిధిలోని NCC నగర్ లో జరుగుతున్న సిఏటిసి -6వ 6 ఆంధ్ర బెటాలియన్ శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన NCC క్యాడేట్లతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ NCC క్రమ శిక్షణకు ,ఐక్యతకు మారుపేరు అన్నారు . ఇక్కడ నేర్పించే ప్రతి అంశము మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు.కాబట్టి పది రోజులు పాటు కొనసాగే ఈ శిక్షణలో నేర్పించే ప్రతి అంశాన్ని ఏకాగ్రతతో ఆలకించి అభ్యసించాలన్నారు. దేశభక్తిని పెంపొందించుకొని దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కర్నూల్ గ్రూప్ కమాండర్ ఎన్ రమేష్ , ప్రణాళిక , సహకారం అసిస్టెంట్ డైరెక్టర్ సంజయ్ గుప్తా, క్యాంపు కమాండర్ సందీప్ ముంద్ర, NCC అధికారులు రాకేష్, అనంతపురం కర్నూల్ పుట్టపర్తి నంద్యాల జిల్లాలకు చెందిన NCC క్యాడేట్లు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కోడేరు