జోడు లింగాల ఆలయానికి పోటెత్తిన భక్తులు

జోడు లింగాల ఆలయానికి పోటెత్తిన భక్తులు

 

కూడేరు,మార్చి 8 (AP 39 TV న్యూస్):-

కూడేరులో ప్రసిద్ధిగాంచిన శివ పార్వతుల జోడు లింగాల సంగమేశ్వర ఆలయానికి శుక్రవారం మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు .దీంతో ఆలయం భక్తులతో పోటెత్తింది. జోడి లింగాల దర్శనార్థం క్యూ కట్టారు. జోడి లింగాలకు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ పురోహితులు శివశంకర శాస్త్రీ, ప్రవీణ్, మహేష్ స్వాములు చేపట్టారు. ఈ సందర్భంగా శివ నామస్మరణ మార్మోగింది. భక్తులకు పోనుగంటి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐ శివరాముడు తన సిబ్బందితో కలిసి చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ రామదుర్గం కృష్ణప్ప సభ్యులు, ఈవో రమేష్ బాబు చర్యలు చేపట్టారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.