సొసైటీ బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయండి

సొసైటీ బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయండి 

-మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి

AP 39 TV న్యూస్ కూడేరు:

 

కూడేరు సొసైటీ బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆ బ్యాంక్ అధ్యక్షుడు కొర్రకొడు వడ్డే గంగాధర్ , సిబ్బందికి సూచించారు .గురువారం ఆయన కూడేరు సొసైటీ బ్యాంకును సందర్శించారు .ఈ సందర్భంగా బ్యాంకు అధ్యక్షుడు, సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం తరువాత శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు .సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు విరివిగా రుణాలు ఇప్పించి తిరిగి రైతుల నుంచి సకాలంలో డబ్బులు వసూలు చేసి బ్యాంకును ఆర్థికంగా బలోపేతం చెందేలా చూడాలని తెలియజేశారు .కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు రామచంద్రారెడ్డి ,దేవేంద్ర, ,ఎర్ర నాగప్ప, గురునాథ్ రెడ్డి, సిద్ధారెడ్డి,బ్యాంకు సిబ్బంది శివ , పరమేష్ పాల్గొన్నారు.

పవన్ కుమార్

రిపోర్టర్ కుడెరూ

Leave A Reply

Your email address will not be published.