కష్టపడి చదివి బంగారు భవిష్యత్తును పొందండి
-జడ్పీ వైస్ చైర్ పర్సన్ నాగరత్నమ్మ ,జడ్పిటిసి సభ్యురాలు తుప్పటి అశ్విని
కూడేరు(ఆగస్టు 29)AP 39TV న్యూస్:-
కష్టపడి చదివి బంగారు భవిష్యత్తును పొందాలని బీసీ హాస్టల్ విద్యార్థినులకు జడ్పీ వైస్ చైర్ పర్సన్ నాగరత్నమ్మ , కూడేరు జడ్పిటిసి సభ్యురాలు తుప్పటి అశ్విని పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి వారు కూడేరు లోని బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికలకు ఏర్పాటు చేసిన భోజన నాణ్యతను పరిశీలించారు . ఎంతమంది సిబ్బంది ఉన్నారని ఆరా తీశారు. మీరు ఒక్కరే విధుల్లో ఉన్నారు .మిగిలిన వారు లేరా అని అశ్వర్తమ్మ ను వారు ప్రశ్నించారు .ఇక్కడ ఇన్చార్జి వార్డెన్ మాధవి లత ఉన్నారు. రెగ్యులర్ వంటమనిషి లేరని, పగలు ఒకరు రాత్రి ఒకరు దిన కూలీతో పని చేస్తున్నామని ఆమె వివరించారు. మెనూ ప్రకారం పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు .తర్వాత బాలికలతో వారు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వసతులను మీకు కల్పిస్తోంది. మీరు కష్టపడి చదవాలని సూచించారు .బాగా చదివి హాస్టల్ కు,తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు రామాంజనేయులు ,ఎర్ర నాగప్ప తదితరులు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు