సబ్సిడీ విత్తన వేరుశనగను రైతులు సద్వినియోగం చేసుకోండి
సబ్సిడీ విత్తన వేరుశనగను రైతులు సద్వినియోగం చేసుకోండి
– సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్
AP39 TV న్యూస్ కూడేరు:
ప్రభుత్వం 40% సబ్సిడీతో అందిస్తున్న విత్తన వేరుశనగకాయలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కూడేరు మండల పరిధిలోని కొర్ర కోడు సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ ,ఎంపీటీసీ సభ్యుడు శివలాల్ రెడ్డి రైతులకు సూచించారు .బుధవారం ప్రభుత్వం సబ్సిడీతో అందజేస్తున్న విత్తన వేరుశనగ పంపిణీని సర్పంచ్ ,ఎంపీటీసీ సభ్యుడు ప్రారంభించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల ముంగిటకే నాణ్యమైన విత్తన వేరుశనగ కాయలను అందజేస్తున్నారని తెలిపారు. రైతు సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు . కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది ,రైతులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్ , కుడేరు