8 నుంచి గ్రంథాలయంలో “సమ్మర్ క్యాంప్”

8 నుంచి గ్రంథాలయంలో “సమ్మర్ క్యాంప్”

-గ్రంథాలయాధికారిణి రాధారాణి 

 

AP39TV న్యూస్, కూడేరు:

 

 

కూడేరులోని గ్రంథాలయంలో ఈనెల 8 నుంచి జూన్ 11వ తేదీ వరకు సమ్మర్ క్యాంప్స్ నిర్వహించనున్నట్లు గ్రంథాలయాధికారిణి రాధారాణి శనివారం తెలిపారు. సమ్మర్ క్యాంపు కు సంబంధించిన పోస్టర్లను ఆమె విడుదల చేశారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కథలు చెప్పడం , పుస్తక పఠనం ,చిత్రలేఖనం , పేపర్ ఆర్ట్ వంటి సృజనాత్మక కార్యక్రమాలు సమ్మర్ క్యాంపులో నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు .కాబట్టి విద్యార్థులు సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పాఠకులు రంగయ్య ,ఎర్రిస్వామి ,రమేష్ , రాముతో పాటు పలవురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.